Mopa Airport PM : గోవాలో ఎయిర్ పోర్ట్ ప్రారంభానికి సిద్దం
11న ఎయిర్ పోర్ట్ కు మోదీ ప్రారభోత్సవం
Mopa Airport PM : దేశంలో ప్రస్తుతం నూతన ఎయిర్ పోర్టులు ప్రారంభోత్సవానికి సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే పలు ఎయిర్ పోర్ట్ లను ప్రారంభించారు. తాజాగా గోవాలో కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టును డిసెంబర్ 11న ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
సోమవారం సీఎం మీడియాతో మాట్లాడారు. నార్త్ గోవా లోని మోపా(Mopa Airport) వద్ద రూ. 2,870 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు ఈ ఎయిర్ పోర్ట్ ను. ప్రస్తుతం దబోలిమ్ లో ఉన్న విమానాశ్రయానికి అదనంగా రాష్ట్రంలో రెండోది సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆరోజు ఉదయం గోవాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుంటారని తెలిపారు.
ఎయిర్ పోర్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను మొదటి దశను ప్రారంభిస్తారని ప్రమోద్ సావంత్ వెల్లడించారు. తొలి దశలో ఏడాదికి 44 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఈ ఎయిర్ పోర్ట్ కు ఉందన్నారు సీఎం. మొత్తం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఏడాదికి కోటి మందికి పైగా ప్రయాణీకులను చేరవేసే సామర్థ్యం దీనికి ఉంటుందని వెల్లడించారు ప్రమాద్ సావంత్.
ప్రస్తుతం ఉన్న దబోలిమ్ ఎయిర్ పోర్ట్ కు ఏడాదిలో 85 లక్షల మంది ప్రయాణీకుల రాక పోకలు సాగించే కెపాసిటీ ఉందన్నారు. కాగా కొత్తగా ప్రారంభించబోయే ఎయిర్ పోర్టులో కార్గో రవాణా సౌకర్యం మాత్రం లేదన్నారు. 11న తొలి దశ కు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.
జీఎంఆర్ సంస్థ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ 40 ఏళ్ల కాలానికి నిర్వహిస్తుందన్నారు సీఎం. ఈ ప్రాజెక్టు ఉత్తర గోవాలో 2,312 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు.
Also Read : ఒకప్పుడు రేడియో జాకీగా పని చేశా – సీజేఐ