Modi Putin : యుద్దం ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదు
పుతిన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ
Modi Putin : రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(Modi Putin) ఫోన్ లో మాట్లాడారు. ఇటీవల పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ , రష్యా మధ్య జరుగుతున్న యుద్దం గురించి ప్రధానంగా చర్చించారు మోదీ. యుద్దం ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదని, శాంతి ఒక్కటే కావాలని సూచించారు.
మానవతా దృక్ఫథంతో యుద్దం ఆపాలని కోరారు మోదీ పుతిన్ (Modi Putin) ను. గత ఏడాది డిసెంబర్ లో అధ్యక్షుడు పుతిన్ భారత దేశ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలుపై ఇద్దరు నేతలు సమీక్షించారు.
అదే సమయంలో తమ వైఖరి మారదని తెలిపారు. గ్లోబల్, ద్వైపాక్షిక అంశాలపై క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాలని పుతిన్, మోదీ అంగీకరించారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
అధికారికంగా శుక్రవారం తెలిపింది. ఇప్పటికే యుద్దం వల్ల వేలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ప్రధానంగా ఈ చర్చల్లో వ్యవసాయ వస్తువులు, ఎరువులు, ఫార్మా ఉత్పత్తులలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించడం ఎలా అనే దానిపై చర్చించారని స్పష్టం చేసింది పీఎంఓ.
అంతర్జాతీయ ఇంధనం, ఆహార మార్కెట్ల స్థితితో సహా ప్రపంచ సమస్యలపై కూడా ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపింది.
ఇద్దరు నేతల చర్చల్లో ప్రధానంగా పదే పదే మోదీ యుద్దాన్ని ఆపాలని సూచించారని తెలిపింది.
Also Read : ముంబైకి ద్రోహం తలపెడితే ఊరుకోను