PM Modi & Rishi Sunak : దూరం త‌గ్గితేనే బంధం పెరుగుతుంది

భార‌త్..బ్రిట‌న్ మ‌ధ్య కొన‌సాగేనా

PM Modi & Rishi Sunak : భార‌తీయ సంత‌తికి చెందిన రిషి సున‌క్ బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరారు. ఆయ‌న ఎన్నికైన వెంట‌నే మొట్ట‌మొద‌టగా స్పందించారు భార‌త దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఇరు దేశాల మ‌ధ్య మ‌రింత బంధం బ‌ల‌ప‌డాలంటే ఇప్పుడున్న ఇంకాస్త దూరం త‌గ్గాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇక ప్ర‌పంచంలోని ప‌లు దేశాల నుండి సందేశాలు వ‌స్తూనే ఉన్నాయి. పీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రిషి సున‌క్(Rishi Sunak)  త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటూ విస్తు పోయేలా చేశారు. అంతే కాదు డిప్యూటీ పీఎంను నియ‌మించారు. లిజ్ ట్ర‌స్ కేబినెట్ లో రాజీనామా చేసి వెళ్లి పోయిన భార‌త సంతతికి చెందిన సుయెలా బ్రేవ‌ర్ మాన్ ను తిరిగి పున‌ర్ నియ‌మించారు రిషి సున‌క్.

దీనిపై పెద్ద రాద్దాంతం జ‌రిగింది. దీనిపై తీవ్రంగా స్పందించారు బ్రిట‌న్ ప్ర‌ధాని. ఆమె త‌న త‌ప్పు తెలుసుకుంద‌ని , అప్పుడు ప‌నితీరు ప‌రంగా అవ‌కాశం ఇవ్వ‌డంలో త‌ప్పు లేద‌న్నారు. ఈ త‌రుణంలో బ్రిట‌న్ , భార‌త్ ఇరు దేశాలు ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం చేయ‌డాన్ని ఖండించాయి.

యుద్దం క్షేమం కాద‌ని ప్ర‌పంచానికి శాంతి కావాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో బ్రిట‌న్ , భార‌త్ దేశాల మ‌ధ్య నిర్మాణాత్మ‌క అడ్డంకులు ఉన్నాయ‌ని , అవి తొల‌గి పోతేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు ప‌డ‌తాయ‌ని గుర్తుంచు కోవాల్సి ఉంది.

ప్ర‌స్తుతం న‌రేంద్ర మోదీ, రిషి సున‌క్(PM Modi & Rishi Sunak) ఇద్ద‌రూ భార‌తీయులే కావ‌డం మ‌రింత ద‌గ్గ‌రి బంధాన్ని కొన‌సాగేందుకు ఆస్కారం ఏర్ప‌డ‌నుంది. ప్ర‌పంచంలో అత్యుత్త‌మమైన విదేశాంగ విధానాన్ని అనుస‌రిస్తోంది. పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సైతం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ ప‌ని తీరును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

Also Read : యుఎస్ తో స్నేహం..ఉక్రెయిన్ కు స‌పోర్ట్ – సున‌క్

Leave A Reply

Your Email Id will not be published!