కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహంచిన రోడ్ షో చేపట్టారు. భారీ ఎత్తున ఆదరణ లభించింది. రెండు రోజుల పాటు పర్యటించారు రాష్ట్రంలో. కొచ్చిన్ లో చేపట్టిన ప్రదర్శనకు జనం జేజేలు పలికారు. భద్రతా సిబ్బందిని సైతం కాదని మోదీ కలిసేందుకు ఉత్సుకత చూపించారు.
రోడ్ షోలో ప్రధాన ఆకర్షణగా మారారు ప్రధానమంత్రి. ఆయన సంప్రదాయ కేరళ దుస్తులను ధరించారు. ఐఎన్ఎస్ గరుడ నావల్ ఎయిర్ స్టేషన్ నుండి యువజన సమ్మేళనం వేదిక వరకు 2 కిలోమీటర్ల మార్గంలో ఇరు వైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేశారు.
పీఎం సెక్యూరిటీ కోసం వేలాది మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. రోడ్ షో ముగిశాక యువం 2023లో ప్రసంగించారు మోదీ. కేరళలో కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మౌలిక సదుపాయాల కల్పన గురించి ప్రస్తావించారు.
గతలో ఏలిన పాలకులు అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడితే బీజేపీ సర్కార్ యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిందని చెప్పారు నరేంద్ర మోదీ. లోకల్ వోకల్ ద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. అంతరిక్షం, రక్షణ రంగాల్లో యూత్ కు ప్రయారిటీ ఇస్తున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.