PM Modi : వందేళ్ల స‌మ‌స్య‌ను 100 రోజుల్లో ప‌రిష్క‌రించ‌లేం

నిరుద్యోగ స‌మ‌స్య‌పై ప్ర‌ధాన‌మంత్రి కామెంట్స్

PM Modi : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిరుద్యోగం అనేది ఇప్ప‌టి నుంచి ఉన్న‌ది కాద‌న్నారు. గ‌తంలో పాల‌కుల వ‌ల్ల చోటు చేసుకున్న ప‌రిణామం అని పేర్కొన్నారు. ఇది ఇప్ప‌టిది కాదు 100 ఏళ్ల స‌మ‌స్య‌. దీనిని 100 రోజుల‌లో ప‌రిష్కరించాలంటే సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.

ఇన్నేళ్లుగా కొన‌సాగుతున్న ఈ స‌మ‌స్య‌ను తీర్చాలంటే కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. శ‌నివారం 10 ల‌క్ష‌ల మంది సిబ్బందికి రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) ప్ర‌సంగించారు. గ‌త ఎనిమిదేళ్ల‌లో ఉపాధి, స్వ‌యం ఉపాధి కోసం ప్ర‌భుత్వం చేస్తున్న కృషిలో రోజ్ గార్ మేళా ఒక ముఖ్య‌మైన మైలురాయి అని స్ప‌ష్టం చేశారు.

ఇది త‌మ ప్ర‌భుత్వం సాధించిన అరుదైన ఘ‌న‌త అని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ. ఉత్పాద‌క రంగం , టూరిజం చాలా ఉద్యోగాల‌ను సృష్టిస్తున్నందున వాటిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. కోవిడ్ స‌మ‌యంలో త‌న ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌పై కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ప్ర‌ధాన‌మంత్రి.

కేవ‌లం ఎంఎస్ ఎంఈ రంగానికి కేంద్రం రూ. 3 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా సాయం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 1.5 కోట్ల ఉద్యోగాల సంక్షోభాన్ని నివారించింద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. ఈ రోజ్ గార్ మేళాలో కొత్త‌గా నియ‌మితులైన 75,000 మందికి నియామ‌క ప‌త్రాలు అంద‌జేసే ప‌నిలో ఉన్నామ‌న్నారు.

ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం (పీఎంఓ) నుండి వ‌చ్చిన ఒక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డం , పౌరుల సంక్షేమానికి భ‌రోసా ఇవ్వ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

Also Read : మోదీ పాల‌న‌లో క‌మీష‌న్..క‌రప్ష‌న్ – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!