PM Modi : తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి – మోది

పుణ్య‌భూమికి రావ‌డం సంతోషంగా ఉంది

PM Modi : తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామ‌రాజు అని కొనియాడారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ రాష్ట్రం పుణ్య‌భూమి అని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి రావ‌డం తాను సంతోషంగా ఉంద‌న్నారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని భీమ‌వ‌రంలోని అల్లూరి సీతారామ రాజు జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్నారు. రూ. 3 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో త‌యారు చేసిన మ‌న్నెం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు ప్ర‌ధాన మంత్రి.

అనంత‌రం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో తెలుగులో ప్రారంభించారు. ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వాలు జ‌రుగుతున్న వేళ అల్లూరి 125వ జ‌యంతి వేడుక‌లు జ‌రుపుకుంటున్నామ‌ని అన్నారు.

మ‌న్యం వీరుడు చేసిన త్యాగం ఈ దేశానికి స్పూర్తిగా నిలుస్తుంద‌న్నారు. వారి కుటుంబాల‌ను స‌త్క‌రించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు న‌రేంద్ర మోదీ(PM Modi).

యావ‌త్ భార‌తానికి మ‌న్నెం వీరుడు స్పూర్తిగా నిలుస్తున్నార‌ని కొనియాడారు. వీర భూమికి శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాని అన్నారు. రంప ఆందోళ‌న ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్త‌యింద‌న్నారు.

ఎంద‌రో మ‌హానుభావులు దేశం కోసం త్యాగం చేశార‌ని చెప్పారు. ఆదివాసుల శౌర్యానికి ప్ర‌తీక అల్లూరి జీవితం అన్నారు. సీతారామ‌రాజు దేశానికి అంకితం చేశార‌న్నారు.

అల్లూరి చిన్న వ‌య‌స్సు లోనే ఆంగ్లేయుల‌పై తిర‌గ‌బ‌డ్డార‌ని చెప్పారు. ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి గొప్ప ఉద్య‌మ‌కారుడ‌ని కితాబు ఇచ్చారు న‌రేంద్ర మోదీ. దేశాభివృద్దికి యువ‌త ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

ఆదివాసీ సంగ్ర‌హాల‌యాలు, లంబ‌సింగిలో అల్లూరి మెమోరియ‌ల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌ధాని చెప్పారు. దేశం కోసం బ‌లిదానం చేసిన వారి క‌ల‌ల‌ను సాకారం చేయాల‌ని కోరారు మోదీ(PM Modi).

Also Read : అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మోదీ

Leave A Reply

Your Email Id will not be published!