PM Modi : మహావీరుని బోధనలు స్పూర్తి కిరణాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM Modi Mahavir Jayanti : భగవాన్ మహావీరుని జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ భగవాన్ మహావీరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మహావీరుని బోధనలను గుర్తు చేసుకున్నారు. ఆయన బోధించిన విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు.
ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జైన మతస్తులకే కాదు యావత్ దేశ ప్రజలందరికీ ప్రీతి పాత్రమైన రోజుగా అభివర్ణించారు ప్రధానమంత్రి.
యావత్ ప్రపంచానికి ఒక వెలుగును ప్రసరించేలా చేసిన ఘనత భగవాన్ మహావీరునిదేనని కొనియాడారు నరేంద్ర మోదీ(PM Modi Mahavir Jayanti) . శాంతియుత, సామరస్య, సుసంపన్నమైన సమాజ నిర్మాణానికి మార్గం చూపారని పేర్కొన్నారు. భగవాన్ మహావీరుని స్పూర్తితో మనం ఎళ్ల వేళలా ఇతరులకు సేవ చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
పేద, అణగారిన వర్గాలలో , వారి జీవితాలలో సానుకూల మార్పును తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఇందుకు భగవాన్ మహావీరుని బోధనలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
ఇదిలా ఉండగా ప్రతి ఏటా ఏప్రిల్ 4న భగవాన్ మహా వీరుని జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అహింసను పాటించాలని , పరులకు ఇబ్బంది కలిగించ కూడదని మహావీరుడు బోధించాడు.
Also Read : మహనీయుడు మహావీరుడు