PM Modi : అవినీతి..బంధుప్రీతికి బీజేపీ దూరం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ

PM Modi : నిస్వార్థంగా సేవ చేసే వారిని భార‌తీయ జ‌న‌తా పార్టీ అక్కున చేర్చుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. భార‌తీయ జ‌న‌తా పార్టీ 44వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గురువారం ఆయ‌న ప్ర‌సంగించారు. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అవినీతి, బంధుప్రీతికి వ్య‌తిరేకంగా బీజేపీ త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తూనే ఉంటుంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు మోదీ.

పార్టీ నిస్వార్థ సేవకు సంబంధించిన ఆద‌ర్శాల‌ను విశ్వ‌సిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌న‌కు హ‌నుమంతుడు ఆద‌ర్శ‌మ‌న్నారు మోదీ(PM Modi) . శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య స‌వాలుగా మారింద‌న్నారు. దానిని కూడా త్వ‌ర‌లోనే అధిగమిస్తామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం దేశాన్ని మూడు స‌మ‌స్య‌లు ప‌ట్టి పీడిస్తున్నాయ‌ని , అవినీతి అనేది ఆక్టోప‌స్ లాగా అల్లుకు పోయింద‌న్నారు. బంధు ప్రీతి కూడా ఎక్కువై పోయింద‌ని ఆవేద‌న చెందారు. అందుకే తాను ప్ర‌ధానిగా కొలువు తీరాక వీటిని దూరంగా ఉంచాన‌ని చెప్పారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

స్వీయ సందేహాన్ని తొల‌గించిన త‌ర్వాత హ‌నుమంతుడి లాగా భార‌త దేశం త‌న సామ‌ర్థ్యాన్ని గ్ర‌హించింద‌ని తెలిపారు. ఇవాళ ఆంజ‌నేయుడి జ‌యంతి అని గుర్తు చేశారు. ఉచిత రేష‌ణ్ ప‌థ‌కం, ఆరోగ్య భీమా , ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల గురించి తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి. ప్ర‌తిప‌క్షాలు పెద్ద‌గా ఆలోచించే స్థితిలో లేవ‌న్నారు. కానీ బీజేపీ అందుకు భిన్నంగా ఆలోచిస్తుంద‌ని అన్నారు .

Also Read : మ‌రాఠా పాతాళంలా న‌డుస్తోంది – రౌత్

Leave A Reply

Your Email Id will not be published!