PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. ఇది భారత దేశానికి అరుదైన గౌరవంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. యోగా అన్నది ఒక అద్భుతమైన ప్రక్రియ అని అభివర్ణించారు. అది శరీరానికి , మానసిక పరమైన ఆరోగ్యానికి ఒక సాధనంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.
దీని వల్ల ఆనందం కలుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా యోగాను ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు ప్రధానమంత్రి. భారత దేశంలో గతంలో పాలకులు యోగాను కావాలని పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను పవర్ లోకి వచ్చాక సీన్ మారిందన్నారు. ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచం మనల్ని చూసి నేర్చుకునేలా యోగా తయారు చేసిందని, ఇదంతా మహర్షులు సాధించిన గొప్ప విజయమని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi).
ఇదిలా ఉండగా యోగాకు ఒక రోజు నిర్వహించడం అన్నది ఉండ కూడదని సూచించారు. ప్రతి నిత్యం యోగాను సాధన చేయాలని కోరారు ప్రధానమంత్రి. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ తరుణంలో యోగా సాధన వల్ల, ధ్యాన ప్రక్రియ ద్వారా మరింత సంతోషకరమైన ఆనందాన్ని అనుభవించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు పీఎం.
Also Read : DK Shiva Kumar : గృహ లక్ష్మి యోజనకు ఢోకా లేదు