PM Modi : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజీ బిజీగా గడుపుతున్నారు. ఆ దేశానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సంస్థల చైర్మన్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, సిఇవోలు ఒక్కరొక్కరు విడి విడిగా ప్రధానితో భేటీ అవుతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై విస్తృతంగా చర్చించారు.
బుధవారం అమెరికాలో ఉన్న మోదీని థింక్ ట్యాంక్ లతో అనుబంధించబడిన వ్యక్తుల సమూహాన్ని కలుసుకున్నారు. విధాన రూపకల్పన, అభివృద్ది చెందుతున్న పోకడల విభిన్న అంశాల గురించి చర్చించారు. భారత దేశంలోని సానుకూల మార్పులు, యువత ద్వారా ఎలా శక్తిని పొందుతున్నాయో కూడా స్పష్టం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi).
అపారమైన వనరులు కలిగి ఉన్నాయని, వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోగలిగితే యావత్ ప్రపంచం మనుగడ సాధించగలదని స్పష్టం చేశారు. కావాల్సిందల్లా ఆయా దేశాల మధ్య సత్ సంబంధాలు కలిగి ఉండడం, భవిష్యత్తు పట్ల నమ్మకంతో ఉండడమే ఇప్పుడు ముఖ్యమని అన్నారు నరేంద్ర మోదీ.
టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వస్తున్న వాటిని ఏ మేరకు సమాజానికి ఉపయోగించు కోగలమనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెడితే బాగుంటుందన్నారు ప్రధానమంత్రి.
Also Read : Pawan Kalyan : ప్రజా సంక్షేమం జన సేన లక్ష్యం
