PM Modi : మణిపూర్ కోసం భారత దేశం – మోదీ
ఎర్రకోటపై జెండా ఎగుర వేసిన ప్రధాని
PM Modi : నా ప్రియమైన కుటుంబ సభ్యులారా అని సంబోదించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మీరంతా నన్ను మణిపూర్ పై మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అనుమానంతో చూస్తున్నారు. మీకు మాటిస్తున్నా మణిపూర్ వెనుక యావత్ భారత దేశం ఉందని స్పష్టం చేశారు. వారి ఆవేదనతో తాను కూడా పంచుకుంటున్నానని చెప్పారు మోదీ.
PM Modi Words About Manipur
హింస ఎన్నటకీ ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదన్నారు ప్రధాని. కేవలం శాంతి నెలకొనడం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కేంద్రం, రాష్ట్రం రెండూ కలిసి మణిపూర్ లో పూర్వ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నాయని స్పష్టం చేశారు మోదీ(PM Modi). ఈ కాలంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు రేపటి తరలాపై ప్రభావం చూపుతాయని గుర్తు చేశారు. యావత్ భారతం కొత్త విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు ప్రధానమంత్రి.
యావత్ ప్రపంచం కొత్త సాంకేతికతను ఆస్వాదిస్తోంది. ఇందులో కీలకమైన పాత్ర భారత దేశం పోషిస్తోందన్నారు. ఇవాళ ఎమర్జింగ్ ఎకానమీ దిశగా పయనిస్తోందన్నారు నరేంద్ర మోదీ. ఈ దేశానికి ప్రధాన అవరోధాలుగా అవినీతి, రాజవంశం , కుటుంబ పాలిటిక్స్ ఉన్నాయని ఆవేదన చెందారు. వరుస పేలుళ్ల శకం ముగిసిందన్నారు. ఉగ్రవాదులు ఇండియాకు రావాలంటే జంకుతున్నారని అన్నారు మోదీ.
Also Read : CM KCR : ఆశించిన లక్ష్యాలకు ఆమడ దూరం – కేసీఆర్