PM Modi : న్యాయ సౌలభ్యం అత్యంత ముఖ్యం – మోదీ
స్పష్టం చేసిన భారత దేశ ప్రధాన మంత్రి
PM Modi : న్యాయ సౌలభ్యం అన్నది అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. న్యూఢిల్లీలో తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ ను మోదీ శనివారం ప్రారంభించారు.
సత్వర న్యాయ బట్వాడా వ్యవస్థలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలు గొప్ప పాత్ర పోషిస్తాయని అన్నారు. న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి కీలక ప్రసంగం చేశారు. ఏ సమాజానికైనా న్యాయ వ్యవస్థకు ప్రాప్యత ఎంత ముఖ్యమో న్యాయం అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు.
న్యాయ పరమైన మౌలిక సదుపాయాలు కూడా దీనికి ప్రధాన సహకారం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా తాము దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ పరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
ఇ కోర్టుల మిషన్ కింద దేశంలో వర్చువల్ కోర్టులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘటన వంటి నేరాల కోసం 24 గంటల పాటు కోర్టులు పని చేస్తున్నాయన్నారు సీజేఐ ఎన్వీ రమణ .
ప్రజల సౌకర్యార్థం కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ మౌలిక సదుపాయాలను కూడా విస్తరింప చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ప్రచారాన్ని ప్రారంభించిందని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు.
Also Read : శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ సిద్దం