PM Modi : అవిశ్వాస తీర్మానం దేవుడిచ్చిన వ‌రం

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కామెంట్

PM Modi : ప్ర‌తిప‌క్షాలు అవిశ్వాస తీర్మానం పెట్ట‌డం దేవుడి దీవెన‌గా భావిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). 2018లో కూడా ఇలాగే జ‌రిగింది. కానీ దేశ ప్ర‌జ‌లు భిన్నంగా స్పందించారు. ప్ర‌తిప‌క్షాల‌ను న‌మ్మ‌లేదు. మ‌మ్మ‌ల్ని దీవెంచారు. మ‌ళ్లీ అధికారాన్ని క‌ట్ట‌బెట్టార‌ని అన్నారు మోదీ. ఇది ప్లోర్ టెస్ట్ అనుకోవ‌డం లేద‌న్నారు. ప్ర‌తిసారీ మేం గెలుస్తూ వ‌చ్చాం. కానీ వాళ్లు ఓడి పోతూనే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

PM Modi Speech In Lok Sabha

విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన ప్ర‌తిసారి ఓట్లు ఎక్కువ‌గా త‌మ‌కే వ‌చ్చాయ‌ని చెప్పారు మోదీ. ప్ర‌తిప‌క్షాలు పేద‌ల గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు. కేవ‌లం అధికారం కోసం మాత్ర‌మే , దాని ప్రాతిప‌దిక‌న పావులు క‌దుపుతున్నార‌ని కానీ వ‌ర్క‌వుట్ కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని కోరుకుంటార‌ని ఇలా మీలాంటి వారిని కోరుకోరంటూ స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.

మీరు ప‌క‌డ్బందీగా ఫీల్డింగ్ ఏర్పాటు చేశారు. కానీ మేం ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ వెళ్లామ‌న్నారు. సెంచ‌రీలు సాధించామ‌ని, మీరు త‌ట్టుకోలేక నో బాల్స్ వేస్తూ పోయార‌ని పేర్కొన్నారు మోదీ. మ‌ళ్లీ 5 ఏళ్ల స‌మ‌యం ఇచ్చాను. కానీ ఎలాంటి ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయ‌లేక పోయారంటూ ఎద్దేవా చేశారు. అనుమానం వారి ర‌క్తంలో ఉంద‌న్నారు. యావ‌త్ ప్ర‌పంచం భార‌త దేశాన్ని నెత్తిన పెట్టుకుంటోంద‌న్నారు. కానీ ప్ర‌తిప‌క్షాల‌కు అది క‌నిపించ‌డం లేద‌న్నారు. మీకు ఈ దేశ సామ‌ర్థ్యాల‌పై న‌మ్మ‌కం లేద‌న్నారు మోదీ.

Also Read : Gaurav Gogoi : మణిపూర్ పై పెద‌వి విప్ప‌ని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!