Modi : ప్రపంచంలో శాంతిని కోరుకునే దేశం ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క దేశం భారత దేశం. భిన్నమైన కులాలు, మతాలతో ఏకత్వంలో భిన్నత్వం కలిగిన కంట్రీ మనది. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, నాగరికత ప్రపంచానికి పాఠాలుగా ఉపయోగ పడ్డాయి.
ప్రవాస భారతీయులు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా సరే ఈ దేశం గురించి, విశిష్టత గురించి తాము ఉంటున్న వారికి తెలియ చేయాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi ).
మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని బెర్లిన్ టూర్ ముగించుకుని డెన్మార్క్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న భారతీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
భారత దేశాన్ని సందర్శించేందుకు ప్రతి ఒక్కరు ఐదు మందిని సందర్శించేలా ప్రతిన పూనండి అని పిలుపునిచ్చారు మోదీ. మీరు ప్రవాస భారతీయులే కాదు భారత దేశానికి మీరంతా ప్రతినిధులు (అంబాసిడర్స్ ) అని స్పష్టం చేశారు.
ఛలో ఇండియా బ్యానర్ కింద తమ సహచరులను భారత దేశానికి ఆహ్వానించాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడు కోవాలని, ప్రతి ఒక్కరు జీవన శైలి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
భారతీయంలో భాగమైన యోగాను ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. డబ్బుల గురించి ఆలోచించకండి. ప్రపంచానికి కావాల్సింది శాంతి, ఆరోగ్యం, సామరస్యం అని స్పష్టం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
మనం యుద్దం కోరుకోవడం లేదు. ప్రతి దేశం బాగుండాలని , స్నేహ పూర్వకమైన సందేశాన్ని ఇస్తున్నామని చెప్పారు ప్రధాన మంత్రి.
Also Read : డిజిటల్ చెల్లింపుల్లో భారత్ టాప్ – మోదీ