PM Modi : ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ – మోదీ
ఆగస్టు 23న అంతర్జాతీయ ఇస్రో దినోత్సవం
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆయన బెంగళూరులో ఇస్రో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 23న అంతర్జాతీయ ఇస్రో దినోత్సవంగా ప్రకటిస్తున్నట్లు పీఎం వెల్లడించారు.
PM Modi Congratulates ISRO Team
చంద్రయాన్ -3ను విజయవంతం చేసినందుకు ఇస్రో చైర్మన్ ను, శాస్త్రవేత్తలను, సిబ్బందిని అభినందించారు. ఈ సక్సెస్ తో తాను ఎంతో సంతోషానికి లోనైనట్లు చెప్పారు. మీరు చేసిన ఈ కృషికి ఇవాళ యావత్ భారతం సలాం చేస్తుందన్నారు.
తాను కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ నా హృదయం ఉప్పొంగుతోంది, అంతే కాదు 140 కోట్ల భారతీయులంతా మీరు సాధించిన విజయాన్ని చూసి గర్విస్తున్నారని అన్నారు మోదీ.
మీరు సాధించిన అపూర్వ విజయం భావి తరాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తుందన్నారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు తనకు ఎదురే లేదని చాటి చెప్పిందన్నారు ప్రధాన మంత్రి(PM Modi). ఇస్రో చీఫ్ సోమనాథ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ ప్రదేశానికి శివ శక్తి అని నామకరణం చేశారు.
ఇది ఏ వైఫల్యమూ అంతిమం కాదని పేర్కొన్నారు నరేంద్ర మోదీ. యావత్ లోకం భారత దేశ వైజ్ఞానిక శక్తిని గుర్తించిందన్నారు.
Also Read : Gaddam Vivek : పార్టీ మార్పుపై వివేక్ కామెంట్