PM Modi : సికింద్రాబాద్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అణగారిన మాదిగ సామాజిక వర్గానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా సికింద్రబాద్ లో జరిగిన విశ్వ రూప మాదిగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
PM Modi Comment about SC Reservations
ఇవాళ దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. మిమ్మల్ని వాడుకున్నారు..మోసం చేశారు. వాళ్లు చేసిన పాపాలను కడిగేసేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు మోదీ(PM Modi).
నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్ల పాటు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పేరుతో మోసం చేసిందని మండిపడ్డారు. కేవలం వాళ్ల పార్టీ అనుయాయులకు మాత్రమే లబ్ది కలిగిందని ఆవేదన చెందారు నరేంద్ర మోదీ.
తెలంగాణ ఏర్పడిన తర్వాత దోపిడీకి కేరాఫ్ గా మారిందన్నారు. ప్రజల అస్తిత్వాన్ని కాపాడుకోలేక పోయిందన్నారు. ప్రస్తుత సర్కార్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాదిగలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ప్రధాన మంత్రి.
దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పాడని, ఆ మాటను మరిచి పోయారని ధ్వజమెత్తారు. దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామన్నారు , దళిత బంధు పేరుతో మోసం చేశాడని మండిపడ్డారు. తెలంగాణ వల్ల ప్రజలకు నష్టం మిగిలిస్తే కల్వకుంట్ల కుటుంబానికి మేలు జరిగిందన్నారు.
Also Read : Valluru Kranti : ఓటు కోసం వినూత్న ప్రచారం