PM Modi Visit : రైలు ప్రమాదం కారకులను శిక్షిస్తాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్నింగ్
PM Modi Visit : ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ జిల్లాలో చోటు చేసుకున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 238కి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని సందర్శించారు ప్రధానమంత్రి(PM Modi Visit). అక్కడ పరిస్థితిని కళ్లారా చూశారు. చలించి పోయారు. అక్కడి నుంచి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు నరేంద్ర మోదీ. ఈ ఘటన నన్ను కలిచి వేసిందన్నారు. ఇది మానవ తప్పిదమా లేక సాంకేతిక పరమైన లోపమా అన్నది పక్కన పెడితే ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న దారుణమైన , విషాదకరమైన ఘటనగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ జాతి మొత్తం నివాళులు అర్పిస్తోందని చెప్పారు. తన వరకు చాలా బాధకు గురైనట్లు చెప్పారు నరేంద్ర మోదీ.
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి. ఇది తీవ్రమైన సంఘటన. అన్ని కోణాల నుండి విచారణకు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్ యుద్ద ప్రాతిపదికన పునరుద్దిస్తారని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సహాయమైనా చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు మోదీ.
Also Read : Odisha Train Comment