PM Modi : కరోనా ప్రమాదం జర భద్రం – మోదీ
జీ20 గ్రూప్ కు మనమే సారథులం
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కీలక ప్రకటన చేశారు. కరోనా మళ్లీ కాటు వేసేందుకు సిద్దంగా ఉందని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం ప్రాణాలను హరించి వేస్తుందని , సాధ్యమైనంత మేరకు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ ఏడాది 2022లో ఆఖరి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ను డిసెంబర్ 25 ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి రేడియో కార్యక్రమంలో ప్రసంగించారు నరేంద్ర మోదీ(PM Modi). రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇది తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని చెప్పారు.
అవసరమైన వాళ్లంతా వెంటనే వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు. రెండు టీకాలు వేసుకున్న వారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు ప్రధానమంత్రి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు నరేంద్ర మోదీ. ప్రజలు పండుగ వేళకు సిద్దం అవుతున్నారని, కానీ తగు జాగ్రత్తలు పాటించక పోతే ఇబ్బందులు పడే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు.
స్వీయ రక్షణే కరోనా నుంచి బయట పడేందుకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. మన దేశం ప్రపంచంలోనే వ్యాక్సిన్ల తయారీలో టాప్ లో నిలిచిందని చెప్పారు. ఏకంగా 220 కోట్ల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసిందని ఇది మనందరికీ గర్వ కాణమన్నారు ప్రధానమంత్రి(PM Modi). ఈ ఏడాది ఎదురైన పెను సవాళ్లను అధిగమించడం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం భయ పెడుతున్న కాలా అజర్ అనే వ్యాధి బీహార్ , జార్ఖండ్ లలో మాత్రమే ఉందన్నారు. జీ20 గ్రూప్ కు మనం సారథ్యం వహించడం గొప్పనైన విషయమన్నారు.
Also Read : వాజపేయ్ జీవితం స్ఫూర్తిదాయకం