PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందే భారత్ రైలు ఇవాళ ప్రగతికి సంకేతంగా మారిందన్నారు. ఒడిశాలో రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడారు మోదీ. వందే భారత్ రైలు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి నడిచినప్పుడల్లా పురోగతిని చూడవచ్చన్నారు ప్రధానమంత్రి. దీని వల్ల అభివృద్ది అర్థం పూర్తిగా మారిపోతుందన్నారు నరేంద్ర మోదీ.
ఒడిశా , పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఇవాళ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందిస్తున్నామని చెప్పారు. ఇది ఆధునిక, ఆకాంక్ష భారత్ కు ప్రతీక అని స్పష్టం చేశారు. దీని వల్ల ప్రయాణీకులకు ప్రయాణ అనుభవంతో పాటు అభివృద్ది అర్థం పూర్తిగా మారి పోతుందన్నారు.
దర్శనం కోసం కోల్ కతా నుండి పూరీకి ప్రయాణించినా లేదా ఇతర మార్గంంలో ప్రయాణించినా వేగంగా చేరుకునేందుకు వీలు కలుగుతోందన్నారు. ఇప్పుడు కేవలం ఆరున్నర గంటల తగ్గించ బడుతుందన్నారు. దీని వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. వ్యాపార అవకాశాలు పెరుగుతాయని , యువతకు కొత్త అవకాశాలను అందిస్తాయని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
దూరం ప్రయాణించాలని అనుకునే ఏ పౌరుడికైనా రైల్వే మొదటి ఎంపిక, ప్రాధాన్యత అని పేర్కొన్నారు. పూరీ , కటక్ రైల్వే స్టేషన్ ల పునరాభివృద్ది, ఆధునీకరణతో సహా ఇవాళ శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు నరేంద్ర మోదీ.
Also Read : DK Shiva Kumar
