PM Modi : పార్లమెంట్ ప్రజా దేవాలయం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM Modi : ఈ దేశంలో అత్యుత్తమమైన ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంలా పార్లమెంట్ కొనసాగుతోందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). నూతన పార్లమెంట్ లోకి ప్రవేశించిన సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని కలిగించాయి.
PM Modi Words
ఎందరో మహనీయుల త్యాగాల , ఆలోచనల ఫలితమే నేటి పార్లమెంట్ అని పేర్కొన్నారు. భిన్నమైన సంస్కృతులకు పెట్టింది పేరు భారత దేశం. ఎన్నో మైలు రాళ్లను మనం అధిగమించామన్నారు. కానీ ఇప్పటికీ ప్రపంచానికి భారత దేశం ఆదర్శనీయమైన దేశంగా వినుతికెక్కిందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
గొప్పనైన డెమోక్రసీ దేశానికి సంబంధించిన వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇవాళ ఎన్నో మార్పులకు ఈ దేశం ప్రత్యక్షంగా చూసిందన్నారు. దాదాపు 92 ఏళ్ల కిందట నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మనం విడిచి వచ్చాం. కానీ కొత్తగా నిర్మించిన ఈ భవనం కూడా దాని వారసత్వాన్ని కొనసాగిస్తుందన్న నమ్మకాన్ని మోదీ వ్యక్తం చేశారు.
అభివృద్ది, సంక్షేమం, వారసత్వం, సంస్కృతీ ఇవే ప్రాతిపదికన భారత దేశం ముందుకు వెళుతోందని చెప్పారు ప్రధాన మంత్రి.
Also Read : RS Praveen Kumar : జనం మధ్యనే ఉంటా వాళ్ల కోసం జీవిస్తా