PM Modi : ఫామ్ హౌస్ లో పడుకునే సీఎం అవసరమా
నిప్పులు చెరిగిన ప్రధాన మంత్రి మోదీ
PM Modi : మెదక్ జిల్లా – సచివాలయానికి రాకుండా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే సీఎం కేసీఆర్ మనకు అవసరామా అని ప్రశ్నించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా తూఫ్రాన్ లో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ సర్కార్ ను ఏకి పారేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా తెలంగాణ మారిందన్నారు మోదీ.
PM Modi Comments on KCR
సకల జనుల, సౌభాగ్య తెలంగాణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. నవంబర్ 26 ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. చేతకాని , అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలాగే ఉంటుందన్నారు. ఎందుకు తెలంగాణలోని రెండు చోట్ల పోటీ చేస్తున్నారంటూ ప్రశ్నించారు నరేంద్ర మోదీ.
గజ్వేల్ లో తమ నాయకుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తుండడంతో ఓటమి భయంతో కేసీఆర్ కామా రెడ్డికి పారి పోయాడంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను సీఎం మనకు అవసరామా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లో పడుకునే సీఎం వల్ల చివరకు నష్టం తప్ప లాభం ఏమీ ఉండదన్నారు.
Also Read : Siddaramaiah : కేసీఆర్ బక్వాస్ సర్కార్ బేకార్