PM Modi : తెలంగాణ సర్కార్ ప్రజలను మోసం చేసిందని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శనివారం వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిమయం గా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు లేని ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని ధ్వజమెత్తారు మోదీ.
స్కామ్ లు, కమీషన్లకు భారత రాష్ట్ర సమితి సర్కార్ మారిందని మండిపడ్డారు ప్రధాన మంత్రి. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను ప్రజలు ఇక ఎంత మాత్రం సహించరని పేర్కొన్నారు. తాము చేసిన స్కామ్ ల నుంచి దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ కొత్త నాటకాలకు తెర లేపారంటూ ఆరోపించారు నరేంద్ర మోదీ(PM Modi).
వరంగల్ కు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. బీజేపీకి, జన్ సంఘ్ కు ఈ ప్రాంతం కేరాఫ్ గా ఉమందన్నారు. వరంగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపించామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగు పనులు మా్తరమే చేసిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. తనను తిట్టేందుకే వారంతా ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ జనం ఒకే కుటంబ కబంధ హస్తాల్లో కూరుకు పోయిందని మండిపడ్డారు. 9 ఏళ్లుగా ఏం చేశారంటూ ప్రశ్నించారు. యూనివర్శిటీలు, స్కూళ్లలో అధ్యాపక, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read : Manoj Muntashir Sorry : ఆది పురుష్ రచయిత క్షమాపణ
