PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని భ్రష్టు పట్టించారని, అభివృద్దికి ఆమడ దూరంలో పెట్టారంటూ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి శనివారం కర్ణాటకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.
తాము వచ్చాక అన్ని రంగాల్లో దేశాన్ని టాప్ లోకి తీసుకు వెళ్లామని చెప్పారు. గతంలో పాలకులు అవినీతికి అందలం వేశారని కానీ తాము వచ్చాక అవినీతి రహిత దేశంగా మార్చేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) . వ్యవస్థలను తమ వారికి అనుకూలంగా మార్చుకునేలా చేశారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక ఎలాంటి బంధు ప్రీతి అనేది లేకుండా చేశామని చెప్పారు మోదీ.
జి20 ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు ప్రధానమంత్రి. టెక్నాలజీ పరంగా ఇవాళ ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు. యావత్ ప్రపంచం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోందని, రాబోయే కాలంలో ప్రపంచ మార్కెట్ ను మన దేశం శాసించే స్థాయికి చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని నిధులు కర్ణాటక రాష్ట్రానికి మంజూరు చెప్పారు నరేంద్ర మోదీ(PM Modi) .
Also Read : నాదే రాజ్యం నేనే సుప్రీం