PM Modi Slams : కోర్టు షాక్ ఇచ్చినా మారక పోతే ఎలా
విపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్
PM Modi Slams : తాము కేంద్ర దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నామని, వేధింపులకు గురి చేస్తున్నామంటూ దేశంలోని 14 ప్రతిపక్ష పార్టీలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కానీ వారికి తీవ్ర నిరాశే మిగిలింది. ఒక రకంగా చెప్పాలంటే చెంప ఛెల్లుమనిపించింది ధర్మాసనం. తాము కక్ష సాధింపునకు పాల్పడడం లేదని మరోసారి స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Slams). తాను బతికి ఉన్నంత వరకు, పవర్ లో ఉంటే గనుక అవినీతి రహిత భారత దేశాన్ని నిర్మించడం లక్ష్యమని స్పష్టం చేశారు.
శనివారం చెన్నైలో చెన్నై – కోయంబత్తూర్ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు ప్రధానమంత్రి. తాము అన్ని రాష్ట్రాలతో సత్ సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని కానీ ఆయా విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలు తమను శత్రువులుగా చూస్తున్నాయని పేర్కొన్నారు. దయచేసి ఆయా రాష్ట్రాల ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు వారికి చేరేలా అడ్డుకోవద్దని కోరారు నరేంద్ర మోదీ.
నాపై , కేంద్ర సర్కార్ పై , చివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలపై విపక్షాలు నోరు పారేసుకున్నాయి. చివరకు కోర్టును ఆశ్రయించాయి. కానీ వారికి మిగిలింది ఏమిటి నిరాశేనని పేర్కొన్నారు ప్రధానమంత్రి. అవినీతితో నిండి పోయిన తమ పుస్తకాలను ఎవరూ విచారించ కూడదని వారు కోరుకున్నారని కానీ తాను మాత్రం ఒప్పుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో జరిగిన సభలో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు ప్రధానమంత్రి(PM Modi).
Also Read : భాగ్య నగరం మోదీకి బ్రహ్మరథం