PM Modi : విపక్షాలకు అంత సీన్ లేదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi : విపక్షాలు ఏకం కావడం అనేది బక్వాస్ అంటూ కొట్టి పారేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi). అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారంతా ఒక వేదికగా ఏర్పడ్డారంటూ ఎద్దేవా చేశారు. వారికి ఓ సిద్దాంతం అంటూ ఏమీ లేదన్నారు. కుటుంబ పార్టీలంటూ కొట్టి పారేశారు. రాబోయే కాలం కూడా తమదేనని కుండ బద్దలు కొట్టారు.
PM Modi Opinion
వాళ్లకు నిబద్దత లేదు. అంతకు మించి దేశంపై ప్రేమ ఏ కోశాన లేదంటూ మండిపడ్డారు. ఎంత మంది ఒకే వేదికగా వచ్చినా లేదా సింగిల్ గా వచ్చినా తమ ఎన్డీయేను ఏ ఒక్కరు ఏమీ చేయలేరంటూ స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీజేపీ సంకీర్ణ సర్కార్ తిరిగి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, త్వరలోనే ఫలితాలలో తేలుతుందని స్పష్టం చేశారు. వ్యవస్థలను ఎవరు నిర్వీర్యం చేశారో వారే తిరిగి తనపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారంటూ ఆవేదన చెందారు. విపక్షాలకు పొద్దున లేచి నప్పటి నుంచి రాత్రి పడుకునేంత దాకా తనను తిట్టక పోతే వారికి నిద్ర పట్టదంటూ మండిపడ్డారు ప్రధాన మంత్రి.
Also Read : Baby Movie : బేబీ మూవీ కలెక్షన్ల వర్షం