PM Modi : తన ఎమ్మెల్యేలనే నమ్మని సీఎం – మోదీ
అశోక్ గెహ్లాట్ పై ప్రధానమంత్రి కామెంట్స్
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను తాను నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. ఇక ఆయన ప్రజలకు , రాష్ట్రానికి ఎలా పాలన అందిస్తాడని ప్రశ్నించారు.
ఈ దేశంలో స్వచ్ఛమైన, సమర్థవంతమైన, నీతి వంతమైన పాలన అందించే ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ అని స్పష్టం చేశారు. ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాషాయ జెండా ఎగరాలని విశ్వసిస్తున్నట్లు చెప్పారు మోదీ. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ లు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారని ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
ప్రస్తుత సర్కార్ లో ఒకరినొకరు విమర్శించు కోవడంతోనే సరి పోతోందని మండిపడ్డారు. వీళ్లు ఎలా పాలిస్తారంటూ నిప్పులు చెరిగారు. సీఎం కుర్ఛీ కష్టాల్లో ఉంటే ఇక రాజస్థాన్ రాష్ట్రం అభివృద్ది గురించి ఎవరు పట్టించుకుంటారంటూ నిలదీశారు ప్రధానమంత్రి. ఇదిలా ఉండగా రాజస్థాన్ సీఎం కు నాయకురాలు సోనియా గాంధీ కాదని బీజేపీకి చెందిన వసుంధర రాజే అని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : అన్నామలైపై పరువు నష్టం కేసు