PM Modi : కాంగ్రెస్ ఓ దోపిడీ దుకాణం – మోదీ
రాజస్థాన్ సర్కార్ పై షాకింగ్ కామెంట్స్
PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే జనం జడుసుకునే స్థితికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అంటేనే ఓ దోపిడీ దుకాణమని , అబద్దాల బజారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజస్థాన్ లో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆపై సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ పై కూడా మండిపడ్డారు. పూర్తిగా అవినీతి, అక్రమాలకు తెర లేపారని, ఎలాంటి అభివృద్దిని చేపట్ట లేక పోయారంటూ ఎద్దేవా చేశారు.
ఇన్నేళ్లుగా ఏం చేశారో చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) డిమాండ్ చేశారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఇక రాబోయే ఎన్నికల్లో సుస్థిరమైన పాలన అందించే సత్తా కలిగిన ఏకైక పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో లేదో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని మండిపడ్డారు మోదీ. అంతర్యుద్దాలు, పోరాటాలతో విలువైన 5 ఏళ్ల పదవీ కాలాన్ని వృధా చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీకి పట్టం కడితే అభివృద్దికి దోహదం చేసినట్లవుతుందని పేర్కొన్నారు.
Also Read : Tirumala Rush : తిరుమలలో పోటెత్తిన భక్తజనం