PM Modi : గుజరాత్ లో ప్రచారానికి మోదీ శ్రీకారం
నవంబర్ 6న పర్యటించనున్న పీఎం
PM Modi : గుజరాత్ లో ప్రధాన మంత్రి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధి షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 1, 5 వ తేదీలలో రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. తాజాగా నవంబర్ 6న ఆదివారం ఎన్నికల క్యాంపెయిన్ చేపట్టేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక తన తొలి పర్యటన చేపట్టనున్నారు నరేంద్ర మోదీ(PM Modi).
ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇక ప్రధాన మంత్రి చేపట్టే ప్రచారం గుజరాత్ లోని భావ్ నగర్ , సురేంద్ర నగర్ , వల్సాద్ లలో జరిగే బీజేపీ ర్యాలీలలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.
రెండు దశాబ్దాలకు పైగా 27 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఉండేది. కానీ ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండనుంది.
ఆ రెండు పార్టీలతో పాటు ఆప్ కూడా రంగంలోకి దిగింది. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ మధ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు మధ్య గడువు రెండు వారాలు ఉండడం విశేషం.
కాగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి నవంబర్ 8న ఓట్లను లెక్కిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదన్నారు.
Also Read : ర్యాలీలో కాల్పులు ఇమ్రాన్ ఖాన్ కు గాయాలు