PM Modi 5G : 5జీ సేవ‌లు ప్రారంభించ‌నున్న మోదీ

విస్తృత‌మైన స్పీడ్ నెట్ వ‌ర్క్

PM Modi 5G :  దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీ స‌ర్వీస్ ల‌కు మోక్షం ల‌భించ‌నుంది. ఇప్ప‌టికే దేశంలో 4జీ సేవ‌లు ఉన్నాయి. వాట‌న్నిటి కంటే అత్య‌ధిక‌మైన స్పీడ్ తో 5జీ స‌ర్వీసెస్ రానుంది.

దీని వ‌ల్ల ఊహించ‌ని రీతిలో స్పీడ్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. దీని వ‌ల్ల కంపెనీలు, ఉద్యోగులు, వినియోగ‌దారులు, ప‌లు సంస్థ‌ల‌కు అత్యంత మేలు చేకూర‌నుంది. ఇప్ప‌టికే టెలికాం కంపెనీలు త‌మ ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. వీటిలో ప్ర‌ధానంగా ఎయిర్ టెల్ , రిల‌య‌న్స్ జియో, వొడా ఫోన్ ఐడియాతో పాటు భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ ఉన్నాయి.

ఇప్ప‌టికే 5జీ స‌ర్వీసెస్ అందించేందుకు టెలికాం సంస్థ‌లు టెస్టింగ్ లు కూడా ప్రారంభించాయి. తాము రెడీగా ఉన్నామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది ఎయిర్ టెల్. ఇదిలా ఉండ‌గా కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అక్టోబ‌ర్ నుంచే 5జీ స‌ర్వీసెస్ దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 1 శ‌నివారం భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజీ ప్రారంభించ‌నున్నారు(PM Modi 5G).

అల్ట్రా – హై – స్పీడ్ ఇంట‌ర్నెట్ కు మ‌ద్ద‌తు ఇస్తుంది 5జీ స‌ర్వీసెస్. భార‌తీయ స‌మాజానికి ప‌రివ‌ర్త‌న శ‌క్తిగా ప‌ని చేస్తుంద‌ని, ఆర్థిక అవ‌కాశాల‌ను , సామాజిక ప్ర‌యోజ‌నాల‌ను ఆవిష్క‌రిస్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు న‌రేంద్ర మోదీ.

ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని ఎర్ర‌కోట వేదిక‌గా జ‌రిగిన పంధ్రాగ‌ష్టు సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంలో ప్ర‌త్యేకంగా 5జీ స‌ర్వీసెస్ గురించి ప్ర‌స్తావించారు. భార‌త‌దేశంపై 5జీ ప్ర‌భావం 2035 నాటికి $450 బిలియ‌న్ల‌కు చేరుతుంద‌ని ఆర్థిక‌, టెలికాం రంగ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Also Read : ద‌స‌రా పండుగ‌ కోసం ప్ర‌త్యేక రైళ్లు

Leave A Reply

Your Email Id will not be published!