PM Modi Vajpayee : వాజపేయ్ జీవితం స్ఫూర్తిదాయకం

దివంగ‌త నేత‌కు ఘ‌న నివాళులు

PM Modi Vajpayee : మాజీ ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ‌పేయ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఇవాళ ఆయ‌న భౌతికంగా లేరు. కానీ నా ప్ర‌తి ఆలోచ‌న‌లో వాజ్ పేయ్ ఉన్నార‌ని పేర్కొన్నారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi Vajpayee). డిసెంబ‌ర్ 25 ఆదివారం మాజీ ప్ర‌ధాని జ‌యంతి.

ఈ సంద‌ర్భంగా ఢిల్లీ లోని స‌దైవ్ అట్ మెమోరియ‌ల్ వ‌ద్ద రాష్ట్ర ప్ర‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ , ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోదర దాస్ మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా , నిర్మ‌లా సీతారామ‌న్ , హ‌ర్దీప్ సింగ్ పురి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు దేశ ప్ర‌ధాన‌మంత్రి. క‌విగా, ర‌చ‌యిత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా , వ‌క్త‌గా అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్ర‌ధాన భూమిక‌ను పోషించార‌ని కొనియాడారు ప్ర‌ధాన‌మంత్రి. ఆయ‌న పేరుతో అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు. ఈ దేశం కోసం ఆయ‌న ఎంత‌గానో కృషి చేశార‌ని తెలిపారు.

మొద‌టి నుంచి చివ‌రి దాకా అట‌ల్ జీ విలువ‌ల‌కు క‌ట్టుబ‌డ్డార‌ని కొనియాడారు. ఆయ‌న‌ను చూసి పార్టీతో పాటు ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా ఎంతో నేర్చుకున్నారంటూ తెలిపారు. వాజ్ పేయ్ ని(PM Modi Vajpayee) చూసి అంతా అజాత శ‌త్రువుగా భావించార‌ని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ. ఇలాంటి నాయ‌కులు కొంద‌రే ఉంటార‌ని అలాంటి వారిలో అగ్ర‌జుడు అట‌ల్ బిహారీ వాజ్ పేయ్ అని స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న ప్ర‌సంగాలు నేటికీ నిత్యం పాఠాలుగా ఉప‌యోగ ప‌డుతున్నాయ‌ని ప్ర‌శంసించారు ప్ర‌ధాన‌మంత్రి. ఇదిలా ఉండ‌గా అటల్ జీ దేశానికి 10వ ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేశారు. 1996 నుండి 2004 దాకా మూడుసార్లు పీఎంగా ఉన్నారు. మొద‌టి సారి 13 రోజులు ఉండ‌గా రెండోసారి 13 నెల‌లు ఉన్నారు. మూడో సారి మాత్రం పూర్తి కాలం పాటు పీఎంగా కొన‌సాగారు.

Also Read : మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నం కోసం రానున్న ముర్ము

Leave A Reply

Your Email Id will not be published!