PM Modi Tribute : ధీరోదాత్తుడు బిర్సా ముండా
ప్రధాని మోదీ నివాళులర్పించారు
PM Modi Tribute : ఈ దేశం గర్వించ దగిన అరుదైన మానవుడు గిరిజన నాయకుడు బిర్సా ముండా అని కొనియాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇవాళ ఆదివాసీల కోసం కృషి చేసిన ఆ మహోన్నత మానవుడి వర్ధంతి ఇవాళ. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జూన్ 9న వర్దంతిని నిర్వహిస్తూ వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఘనంగా నివాళులు అర్పించారు.
భగవాన్ బిర్సా ముండా కోట్లాది గిరిజనుల హక్కుల కోసం పోరాడారని కొనియాడారు ప్రధానమంత్రి. ఆయనకు లక్షలాది వందనాలు. పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తన సర్వస్వాన్ని త్యాగం చేశాడని గుర్తు చేశారు నరేంద్ర మోదీ. కృతజ్ఞతతో కూడిన దేశం గిరిజన సమాజ అభ్యున్నతి కోసం బిర్సా ముండా చేసిన కృషిని ఎల్లప్పటికీ రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బిర్సా ముండా జీవించింది కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఈ కొద్ది కాలంలోనే ఆదివాసీల అభ్యున్నతి కోసం పరితపించాడు. ఆపై ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా జట్టు కట్టాడు. అడవి బిడ్డలతో ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేశాడు. ఈ భూమి ఆంగ్లేయులది కాదని ఇది తమ చెమట చుక్కలతో కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీలదని నినదించాడు బిర్సా ముండా.
మార్చి 3, 1900లో ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో అడవిలో చుట్టు ముట్టారు ఆంగ్లేయుల సైనికులు.
Also Read : Navjyot Sidhu Wife : సీఎం పదవిని త్యాగం చేసిన సిద్దూ