PM Modi Tribute : జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూకు మోదీ నివాళి

మే 27 నెహ్రూ వ‌ర్ధంతి..దేశానికి తొలి ప్ర‌ధాని

PM Modi Tribute : భార‌త దేశానికి తొలి ప్ర‌ధాన మంత్రిగా ప‌ని చేసిన జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ వ‌ర్దంతి ఇవాళ‌. ప్ర‌తి ఏటా మే 27న నెహ్రూ వ‌ర్దంతిని నిర్వ‌హిస్తారు. ప్ర‌భుత్వం అధికారికంగా చేప‌డుతుంది కూడా. ఆయ‌న వ‌ర్దంతి సంద‌ర్భంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ నివాళులు అర్పించారు(PM Modi Tribute). 1947లో దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చింది. నెహ్రూను ప్ర‌ధానిగా ఎన్నుకున్నారు. ఆయ‌న హ‌యాంలో దేశం అన్ని రంగాల‌లో కీల‌క‌మైన మార్పులు చ‌వి చూసింది.

ఈ దేశం గురించి ఎన్నో క‌ల‌లు క‌న్నారు. ప్రాజెక్టులు, ప‌రిశోధ‌న‌లు, విశ్వ విద్యాల‌యాలు , కంపెనీలు రూపుదిద్దుకున్నాయి. యావ‌త్ ప్ర‌పంచం బాగుండాల‌ని క‌ల‌లు క‌న్నారు. ఈ దేశంలో శాంతి , సామ‌ర‌స్యం వెల్లి విరియాల‌ని కోరుకున్నారు జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ.

నెహ్రూ వ‌ర్దంతి సంద‌ర్భంగా శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నివాళులు అర్పించారు ప్ర‌ధాని మోదీ. భార‌త స్వాతంత్ర పోరాటంలో నెహ్రూ ప్ర‌ముఖ పాత్ర పోషించార‌ని కొనియాడారు. ఈ దేశాన్ని బ్రిటీష్ పాల‌న నుండి విముక్తి చేసేందుకు పోరాడారు. ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ స్థాప‌నంలో కీల‌క పాత్ర పోషించారు.

మే 27, 1964లో క‌న్ను మూశారు నెహ్రూ. 1947 నుండి 1964 వ‌ర‌కు 74 ఏళ్ల వ‌య‌సులో మ‌రణించేంత దాకా పీఎంగా ఉన్నారు. ఆయ‌న‌కు పిల్ల‌లంటే చాలా ఇష్టం. చాచా నెహ్రూ అని పిలుచుకునే వారు. ఆయ‌న పుట్టిన రోజును బాల‌ల దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు.

Also Read : Mohammad Iqbal

 

Leave A Reply

Your Email Id will not be published!