PM Modi Tribute : ఆజాద్..తిల‌క్ కు కోటి వంద‌నాలు

ధైర్యం..పోరాటం..స్పూర్తి దాయ‌కం

PM Modi Tribute : సంపూర్ణ స్వేచ్ఛ‌ను కోరుతూ ప‌రాయి పాల‌న పునాదిని క‌దిలించిన యోధులు లోక మాన్య బాల గంగాధ‌ర్ తిల‌క్ , చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ జ‌యంతి సంద‌ర్బంగా కోటి వంద‌నాలు స‌మ‌ర్పిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. శ‌నివారం ఈ ఇద్ద‌రి పోరాట యోధుల జ‌యంతి. దేశ స్వంతంత్ర ఉద్య‌మంలో వీరు చేసిన పోరాటం, ధైర్యం, అంకిత భావ‌ల క‌థ దేశ ప్ర‌జ‌ల‌కు ఎల్లప్ప‌టికీ స్పూర్తినిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

PM Modi Tribute To

దేశం కోసం వారు చేసిన కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి(PM Modi). యావ‌త్ దేశం వీరు చేసిన సాహ‌సానికి స‌లాం చేస్తుంద‌న్నారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. 137 కోట్ల మంది ప్ర‌జ‌లు ఎల్ల‌ప్ప‌టికీ మీకు రుణ‌ప‌డి ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. పూర్ణ స్వ‌రాజ్ (సంపూర్ణ స్వ‌రాజ్యం) కోసం త‌న జీవితాన్ని అంకితం చేసిన యోధుడు బాల గంగాధ‌ర తిల‌క్ అన్నారు.

ఇదిలా ఉండ‌గా తిల‌క్ 1856లో మ‌హారాష్ట్ర లోని చిక‌లిలో పుట్టారు. మ‌రో వైపు చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ సంపూర్ణ స్వతంత్ర స‌మ‌ర యోధుడిగా గుర్తింపు పొందారు. చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ నిర్భ‌య‌మైన , ధృఢ నిశ్చ‌యానికి చెందిన పోరాట స్పూర్తి క‌లిగిన గొప్ప వ్య‌క్తి అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఆజాద్ చేసిన త్యాగం, ధైర్య సాహ‌సాలు దేశ ప్ర‌జ‌ల‌కు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తాయ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ మ‌ధ్య ప్ర‌దేశ్ లోని భ‌ర్వాలో 1906లో పుట్టారు.

Also Read : MP Raghav Chadha : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఆప్ గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!