PM Modi : స‌మున్న‌త భార‌తం త్రివ‌ర్ణ ప‌తాకం – మోదీ

పిలుపునిచ్చిన దేశ ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Modi :  ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా ఈసారి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగ‌స్టు 13 నుంచి 15 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా త్రివ‌ర్ణ ప‌తాక పండుగ‌ను నిర్వ‌హిస్తోంది.

దేశంలోని ప్ర‌తి ఇంటిపై జాతీయ ప‌తాకం ఎగుర వేయాలి. ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాలు నిమ‌గ్న‌మై ఉన్నాయి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు.

ఇందులో భాగంగా ప్ర‌తి నెలా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)  మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఆదివారం జ‌రిగిన మ‌న్ కీ బాత్ ప్రోగ్రామంలో జాతిని ఉద్దేశించి మోదీ ప్ర‌సంగించారు.

ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన త్రివ‌ర్ణ ప‌తాక పండుగ‌ను ఘ‌నంగా విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఎవ‌రైనా సోష‌ల్ మీడియా (సామాజిక మాధ్య‌మాలు )ను ఉప‌యోగిస్తున్నారో వారంతా జాతీయ ప‌తాకాన్ని త‌మ డీపీ (సోష‌ల్ స్టేట‌స్ ) గా పెట్టుకోవాల‌ని సూచించారు.

దీని వ‌ల్ల జాతీయ ప‌తాకం ప‌ట్ల‌, దేశం ప‌ట్ల త‌మ‌కు ఉన్న గౌర‌వాన్ని తెలియ చేసిన‌ట్ల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి. ఈ దేశ భ‌విష్య‌త్తు యువ‌తీ యువ‌కుల‌పై ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు నరేంద్ర మోదీ(PM Modi) .

గ‌త నెల‌లో చోటు చేసుకున్న ఆస‌క్తిక‌ర‌మైన విజ‌యాలు, గాథ‌లు, క‌థ‌నాలతో కూడిన బుక్ లెట్ ను కూడా ఈ సంద‌ర్భంగా ఆవిష్క‌రించారు ప్ర‌ధాన మంత్రి.

తాజాగా నిర్వ‌హించిన ఈ మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం 91వ‌ది కావ‌డం విశేషం. మొద‌టి రేడియో కార్య‌క్ర‌మం అక్టోబ‌ర్ 3, 2014న ప్ర‌సారం చేశారు. ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం కొత్త ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది.

Also Read : ఉదార‌వాద ప్ర‌జాస్వామ్యం దేశానికి అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!