PM Modi : కెనడా ప్రధాని ట్రూడోపై మోదీ కన్నెర్ర
ఖలిస్తాన్ పై ప్రజాభిప్రాయ సేకరణ
PM Modi : కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడోపై మొదటిసారిగా సీరియస్ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). భారత దేశానికి సంబంధించి ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా, జోక్యం చేసుకున్నా సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రష్యా ఆక్రమిత తూర్పు ఉక్రెయిన్ లో ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు జస్టిస్ ట్రూడో.
ఇదే సమయంలో వచ్చే నెల నవంబర్ 6న ఖలిస్తాన్ రెఫరెండంపై పీఎం ట్రూడో స్పందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ప్రధాని. భారత దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్నందున అంటారియోలో నిషేధిత సంస్‌థ నిర్వహించ తలపెట్టిన ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను నిలిపి వేయాలని నరేంద్ర మోదీ జస్టిస్ ట్రూడోను హెచ్చరించారు.
లేక పోతే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు తెంచు కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కెనడియన్ హై కమిషన్ లోని సీనియర్ అధికారికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయంపై స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా భారత దేశం బలమైన ఆందోళనను ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం వచ్చే వారం కెనడాలోని గ్లోబల్ అఫైర్స్ కు తెలియ చేస్తుంది.
మరో వైపు గత నెల సెప్టెంబర్ 16న భారత దేశానికి సంబంధించిన ప్రాదేశిక సమగ్రతను , సార్వ భౌమత్వాన్ని గౌరవిస్తుందని , ప్రజాభిప్రాయ సేకరణను తాము గుర్తించబోమంటూ స్పష్టం చేసింది. కానీ మాట మార్చడాన్ని తీవ్రంగా పరిగణించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇదిలా ఉండగా రెండు నాల్కల ధోరణి మంచిది కాదని హితవు పలికారు మోదీ.
Also Read : ఎక్కువగా కండోమ్ లు వాడుతున్నది మేమే