Modi PM : జాతీయ చిహ్నాన్ని ఆవిష్క‌రించిన మోదీ

శ్ర‌మైక సౌంద‌ర్యానికి వెల క‌ట్ట‌లేమ‌న్న ప్రధాని

Modi PM : దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న చందంగా శ‌ర‌వేగంగా పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణ ప‌నులు. మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తోంది.

జాతి గ‌ర్వించేలా, దేశ ప్ర‌తిష్ట‌ను మ‌రింత ఇనుమ‌డింప చేసేలా ఉండేలా త‌యారు చేయాల‌ని సంక‌ల్పించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని భ‌వ‌న నిర్మాణం చేప‌డుతున్నారు.

పార్ల‌మెంట్ నూత‌న భ‌వ‌నాన్ని ఈ ఏడాది అక్టోబ‌ర్ నెల లోపు పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించారు. సోమ‌వారం పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల్ని ప‌రిశీలించారు స్వ‌యంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(Modi PM).

ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్ భ‌వ‌నంపై అకోక స్తంభాన్ని (నాలుగు సింహాల‌తో ) త‌యారు చేసిన దానిని ఆవిష్క‌రించారు. దీనిని 9,500 కిలోల బ‌రువు కాంస్య‌తో త‌యారు చేశారు. ఇది 6.5 మీట‌ర్ల ఎత్తులో ఉంది.

మోదీతో పాటు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, ప‌లువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఈ కొత్త పార్ల‌మెంట్ (లోక్ స‌భ‌, రాజ్య స‌భ‌) భ‌వ‌న నిర్మాణం కోసం కేంద్రం రూ. 971 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేశారు.

కానీ అంచ‌నా కంటే మ‌రో 29 శాతం పెరిగి రూ. 1,250 కోట్ల‌కు చేరుకుంది. మొత్తం 13 ఎక‌రాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన 200 మంది క‌ళాకారులు ఇందులో పాలు పంచుకుంటున్నారు.

ఈ భ‌వ‌నంలో మొత్తం ఆరు విభాగాలుగా నిర్మిస్తున్నారు. దేని ప్ర‌త్యేక‌త దానికి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు.

Also Read : జాతీయ చిహ్నం నైపుణ్యం అద్బుతం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!