PM Modi : దీపోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మోదీ
అయోధ్యకు చేరుకుంటారని పీఎంఓ వెల్లడి
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి ఎక్కడ చేస్తారనే ఉత్కంఠకు తెర దించింది ప్రధానమంత్రి కార్యాలయం. దీపోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా దీపోత్సవ వేడుకల సందర్భంగా ప్రజలు సరయు నది ఒడ్డున లేజర్ షోను వీక్షించారు.
దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దీపావళి కోసం భారత దేశం ఆనందోత్సాహాలలో మునిగి పోయే ఒక రోజు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అయోధ్యను సందర్శించే అవకాశం ఉంది. ఇదే సమయంలో రామాలయంలో కూడా పూజలు చేస్తారని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా దీపోత్సవ వేడుకల సన్నాహాలను పరిశీలించేందుకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ (CM Yogi) బుధవారం పవిత్ర నగరాన్ని సందర్శించనున్నారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఆదిత్యానాథ్ అయోధ్యకు వెళ్లడం ఇది నాలుగోసారి. రామాలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాని మోదీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్రాన్ని పరిశీలిస్తారని సమాచారం.
అక్కడ భారీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. తాత్కాలిక పర్యటన షెడ్యూల్ ప్రకారం రామ్ లీలాలో ఏర్పాటు చేసిన రామ్ కథా పార్కును సందర్శించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). అయోధ్యలో రామ మందిర నిర్మాణ కమిటీ (ఆర్ఎంసీసీ) రెండు రోజుల సమీక్షా సమావేశం ముగిసింది.
రామ మందిర నిర్మాణ పనులు దాదాపు 50 శాతం పూర్తయ్యాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ డిజిటల్ బాణా సంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు.
Also Read : ఎన్నికల వేళ గుజరాత్ లో వ్యాట్ తగ్గింపు