PM Modi : కేదార్‌నాథ్ ఆల‌యంలో మోదీ పూజ‌లు

గౌరీకుండ‌-కేదారీనాథ్ రోప్ వే ప్రాజెక్టుకు శంకుస్థాప‌న‌

PM Modi : ఉత్త‌రాఖండ్ లో రెండు రోజుల ప‌ర్య‌టన‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)  శుక్ర‌వారం కేదార్ నాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా పూజ‌లు చేశారు. పూజారులు ప్ర‌ధానికి ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు. ఇందులో భాగంగా గౌరీకుండ – కేదారీనాథ్ రోప్ వే ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు.

అంతే కాకుండా వివిధ అభివృద్ది ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. కేదార్ నాథ్ ఆల‌యం ప్ర‌సిద్ది చెందిన దేవాల‌యం. ఇది రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లాల‌లో ఉంది. స్వ‌స్తిక చిహ్నాన్ని ఎంబ్రాయిడ‌రీ చేసిన కొండ ప్ర‌జ‌ల తెలుపు రంగు సంప్ర‌దాయ దుస్తుల‌ను ధ‌రించి ఆల‌యానికి విచ్చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

అనంత‌రం బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని కూడా సంద‌ర్శించారు. మ‌రికొన్ని ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అంత‌కు ముందు రోజు భార‌త వైమానిక ద‌ళం (ఐఏఎఫ్‌) విమానంలో డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమాన‌శ్ర‌యానికి చేరుకున్నారు మోదీ(PM Modi) . ప్ర‌ధాన మంత్రికి గ‌వ‌ర్న‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ గుర్మిత్ సింగ్ , ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి , కేంద్ర మంత్రి అజ‌య్ భ‌ట్ స్వాగ‌తం ప‌లికారు.

కేదార్ నాథ్ ఆల‌యంలో పూజ చేసిన త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి 9.7 కిలోమీట‌ర్ల మేర నిర్మించ బోయే గౌరీకుండ – కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్టుకు ప్రారంభించారు. ఇది గ‌నుక ఓకే అయితే రోప్ వే ద్వారా భ‌క్తులు గౌరీకుండ్ నుండి 30 నిమిషాల్లో ఆల‌యానికి చేరుకునేందుకు వీలు క‌లుగుతుంది.

ఈ సంద‌ర్బంగా పూజ చేసిన పూజారులు దేశాన్ని ముందుకు వెళ్లే శ‌క్తి ప్ర‌ధానికి ఇవ్వాల‌ని ప్రార్థించారు. ఆది గురువు శంక‌రాచార్యుల స‌మాధి స్థలాన్ని కూడా సంద‌ర్శించారు మోదీ.

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త

Leave A Reply

Your Email Id will not be published!