PM Modi : సోమ‌నాథ్ ఆల‌యంలో మోదీ పూజ‌లు

గుజ‌రాత్ లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం

PM Modi : గుజ‌రాత్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి మ‌రింత రాజుకుంది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ను జారీ చేసింది. గ‌త 27 ఏళ్లుగా ఇక్క‌డ భార‌తీయ జ‌న‌తా పార్టీ కొలువు తీరి ఉంది. ఈ త‌రుణంలో మ‌రోసారి ప‌వర్ లోకి రావాల‌ని యోచిస్తోంది.

ఇందులో భాగంగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)  ఆదివారం రాష్ట్రంలో పేరొందిన సోమ‌నాథ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. పూజ‌లు చేశారు. పీఎం నిన్న‌నే గుజ‌రాత్ కు చేరుకున్నారు. ఇది ఆయ‌న స్వంత రాష్ట్రం.

ఈసారి ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను పూర్తిగా త‌న మీద వేసుకున్నారు ట్రబుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ఇటా న‌గ‌ర్ ను సంద‌ర్శించారు అంత‌కు ముందు న‌రేంద్ర మోదీ. 600 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 640 కోట్ల‌కు పైగా ఖ‌ర్చుతో నిర్మించిన ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు. యూపీలోని వార‌ణాసిని సంద‌ర్శించారు ప్ర‌ధాన‌మంత్రి. అక్క‌డి నుంచి నేరుగా గుజ‌రాత్ కు చేరుకున్నారు.

ఇవాళ పూజ‌ల అనంత‌రం ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు న‌రేంద్ర మోదీ. ఫిషింగ్ ప‌రిశ్ర‌మ‌ల కేంద్రంగా పేరొంద‌ని వీరావ‌ల్ లో ర్యాలీని చేప‌ట్ట‌నున్నారు. అనంత‌రం ధోరాజీ, అమ్రేలి, బొటాడ్ లలో జ‌రిగే ర్యాలీలో పాల్గొంటారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) . అంత‌కు ముందు వ‌ల్సాద్ లో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్నారు మోదీ.

మూడు రోజుల వ్య‌వ‌ధిలో ఎనిమిది ర్యాలీలు చేప‌ట్టేలా ప్లాన్ చేసింది బీజేపీ. మొత్తంగా మోదీ టూర్ తో కాషాయ ద‌ళాలలో జోష్ పెరిగింది.

Also Read : ప‌వ‌ర్ కోసం రాహుల్ పాద‌యాత్ర – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!