PM Modi Prince Charles III : కింగ్ చార్లెస్ – 3తో మోదీ సంభాష‌ణ

కీల‌క అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ

PM Modi Prince Charles III : బ్రిట‌న్ రాజు కింగ్ చార్లెస్ -3తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంభాషించారు. ఆయ‌న ఫోన్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. చార్లెస్ -3 కొలువు తీరాక మొద‌టిసారి మాట్లాడ‌టం. ఇరు దేశాల‌కు సంబంధించి ఇప్ప‌టికే నూత‌న ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నికైన ప్ర‌వాస భార‌తీయుడు రిషి సున‌క్ తో ఇండోనేషియాలోని బాలిలో జ‌రిగిన జీ20 శిఖ‌రాగ్ర స‌మావేశంలో ప్ర‌ధాని క‌లుసుకున్నారు.

వీరిద్ద‌రూ ఇరు దేశాల మ‌ధ్య మ‌రింత బంధం బ‌ల‌పాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా బ్రిట‌న్ రాజు కింగ్ చార్లెస్ -3 తో ఫోన్ లో చాలా సేపు మాట్లాడారు ప్ర‌ధాన మంత్రి దామోద‌ర దాస్ మోదీ. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని కీల‌క అంశాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు బ్రిట‌న్ రాజు కింగ్ చార్లెస్ -3తో.

జీవ వైవిధ్య ర‌క్ష‌ణ‌, ఇంధ‌న పరివ‌ర్త‌న‌కు ఆర్థిక సాయం, వినూత్న ప‌రిష్క‌రాల అన్వేష‌ణ‌, త‌దిత‌ర కీల‌క అంశాల గురించి ఏక‌రువు పెట్టారు. ఈ విష‌యాన్ని భార‌త ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్ర‌ధాన అంశాల‌తో పాటు జీ20కి భార‌త దేశం అధ్య‌క్ష‌త వ‌హిస్తోంది. శిఖ‌రాగ్ర స‌మావేశానికి సంబంధించిన ప్రాధాన్య‌తల గురించి కూడా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కింగ్ చార్లెస్ -3తో(PM Modi Prince Charles III)  చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది 2022 డిసెంబ‌ర్ 1 నుంచి భార‌త దేశం జీ20 శిఖ‌రాగ్ర గ్రూప్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. ఇది ఒక ర‌కంగా భార‌త దేశ నాయ‌క‌త్వానికి, సామ‌ర్థ్యానికి ల‌భించిన గౌర‌వం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : మోదీ బాధ‌లో ఉన్నారు ఏమ‌ని అడ‌గ‌ను

Leave A Reply

Your Email Id will not be published!