Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు యూరప్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ , రష్యా యుద్దం పై చర్చించే అవకాశం ఉంది.
తన చిరకాల మిత్రుడిగా భావించే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో ఈనెల 4న పారిస్ లో భేటీ కానున్నారు. కాగా మాక్రాన్ ఇటీవలే ఎన్నికల్లో విజయం సాధించారు.
ఈ ఏడాదిలో ప్రధాని మోదీ తొలిసారి విదేశీ పర్యటన ఇదని వెల్లడించారు విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా. భారత దేశం వాణిజ్యం, హరిత అభివృద్ది వంటి కీలక రంగాలలో సహకారంపై ప్రధాని ఫోకస్ పెట్టనున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి మోదీ పర్యటన బెర్లిన్ లో ప్రారంభం అవుతుంది. ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ కి సహ అధ్యక్షుడిగా ఉంటారు.
డెన్మార్క్ , ఐస్ లాండ్ , ఫిన్ లాండ్ , స్వీడన్ , నార్వే దేశాల నుంచి రెండో ఇండియా నార్దిక్ సమ్మిట్ , ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ (Modi )వెళ్లారు.
కాగా ఉక్రెయిన్ , రష్యా యుద్దం గురించి పలుసార్లు తన వైఖరిని వెల్లడించింది. తాము బేషరతుగా యుద్దం కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. శాంతి తమ లక్ష్యమని , తమ విదేశాంగ విధానం ఎవరినీ నొప్పించడం అంటూ ఉండదన్నారు క్వాత్రా.
ఉక్రెయిన్ పై దాడిని ఆపాలని తాము రష్యాకు విన్నవించామన్నారు. ఇరు దేశాలు సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించు కోవాలని భారత్ మొదటి నుంచి కోరుతోందన్నారు.
Also Read : యూసీసీ అమలు చేయాల్సిందే – సీఎం