PM Modi : గాంధీ..శాస్త్రిల‌కు న‌రేంద్ర మోదీ నివాళి

ప్రార్థ‌నా స‌మావేశంలో పాల్గొన్న ప్ర‌ధాని

PM Modi : దేశం గ‌ర్వించ ద‌గిన మ‌హానుభావుల‌లో ఒక‌రు జాతిపిత మ‌హాత్మా గాంధీ. మ‌రొక‌రు దేశ మాజీ ప్ర‌ధాని దివంగ‌త లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి. అక్టోబ‌ర్ 2 ఇద్ద‌రి జ‌యంతి. ఈ సందర్భంగా ఆ ఇద్ద‌రికీ యావ‌త్ భార‌తం నివాళులు అర్పిస్తోంది. తాజాగా గాంధీ స్మృతి వ‌ద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ప్రార్థ‌నా స‌మావేశానికి న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

అంత‌కు ముందు రాజ్ ఘాట్ లో మ‌హాత్మా గాంధీ , విజ‌య్ ఘాట్ లో మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి చిత్ర ప‌టాల‌కు మోదీ పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ప్ర‌ధాన‌మంత్రితో(PM Modi) పాటు దేశ ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ కూడా హాజ‌ర‌య్యారు. వారికి నివాళులు అర్పించారు.

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కూడా నివాళులు అర్పించారు. వారందించిన స్పూర్తి నేటికీ కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు. యావ‌త్ ప్ర‌పంచం ఇవాళ గాంధీని స్మ‌రించుకుంటోంది. ఆయ‌న ప్ర‌వ‌చించిన శాంతి, స‌హ‌కారం, సేవను ప‌దే ప‌దే జ్ఞాపకం చేసుకుంటోంది. భార‌త దేశంలో, ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు.

అక్టోబ‌ర్ 2, 1869న గుజ‌రాత్ లోని పోర్ బంద‌రు లో పుట్టారు మ‌హాత్మా గాంధీ. అహింస‌ను నిర‌సించారు. బ్రిటిష్ వ‌ల‌స పాల‌న‌కు వ్య‌తిరేకంగా స్వాతంత్ర పోరాటంలో ముందంజ‌లో ఉన్నారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో, మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో 1947లో దేశానికి స్వేచ్ఛ ల‌భించింది. స్వ‌రాజ్యం, అహింస ప‌ట్ల మ‌హాత్మా గాంధీకి ఉన్న అచంచ‌ల విశ్వాసమే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంది.

ఇదిలా ఉండ‌గా 1904లో యూపీలో పుట్టిన లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి భార‌త దేశానికి రెండో ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని
చేశారు.

Also Read : శాస్త్రి ప్ర‌స్థానం ప్రాతః స్మ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!