PM Modi Meeting : రైలు ప్రమాదంపై మోదీ సమీక్ష
ఘటనా స్థలాన్ని సందర్శించే ఛాన్స్
PM Modi Meeting : ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ లో చోటు చేసుకున్న రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రుల్లో చేర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తేరుకున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి వెంటనే స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆపై మృతులకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ప్రధాన మంత్రి సహాయ నిధి కింద ప్రకటించారు. అవసరమైతే మరింత సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఘటన జరిగిన వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారు. శనివారం ఆయన స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆయనతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి విచారణకు ఆదేశించామని ఈ సందర్భంగా చెప్పారు.
ఇదిలా ఉండగా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ ఒడిశాకు పీఎం వెళతారని సమాచారం.
Also Read : Odisha CM Navin Patnaik