PM Touches Modi Feet : మోదీ పాదాలను తాకిన ప్రధాని
ఆలింగనం చేసుకున్న పీఎం
PM Touches Modi Feet : అరుదైన సన్నివేశానికి వేదికైంది. స్వాగత కార్యక్రమంలో పాపువా న్యూ గినియా ప్రధాని(PM) అనుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీని(Modi) విస్మయానికి గురి చేశారు. ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పాదాలను(Modi Feet) తాకేందుకుం ప్రయత్నం చేశారు. దీంతో ఆయనను వారించే ప్రయత్నం చేశారు పీఎం. వెంటనే మోదీ పీఎంను ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ప్రధాన మంత్రి మోదీ జపాన్ లోని హిరోషిమా నుంచి నేరుగా పపువా న్యూ గినియా దేశానికి చేరుకున్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా ఫసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫఐపీఐసీ) మూడో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు మోదీ ఇక్కడికి వచ్చారు. పసిఫిక్ ద్వీప దేశాన్ని సందర్శించిన మొట్ట మొదటి భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ.
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ప్రధాని జేమ్స్ మరాపే ఆయన పాదాలను తాకారు. స్వాగతం పలికారు. పపువా న్యూ గినియా సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశంలోకి వచ్చే ఏ నాయకుడికి స్వాగతం పలకదు. రాత్రి 10 గంటల తర్వాత వచ్చిన ప్రధాని మోదీకి మినహాయింపు ఇచ్చారు. గవర్నర్ శశింద్రన్ ముత్తువేల్ మాట్లాడుతూ ప్రధాని జేమ్స్ మరాపే ప్రధాని మోదీపై ఉన్న గాఢమైన గౌరవంతో పాదాలు తాకారని చెప్పారు.
Also Read : Brij Bhushan Singh