Supreme Court : పీఎంఎల్ఏ చట్టం ప్రమాదకరం
సుప్రీంకోర్టు తీర్పుపై విపక్షాలు గరం
Supreme Court : కేంద్ర దర్యాప్తు సంస్థలకు మరింత వెసులుబాటు కల్పించే పీఎంఎల్ఏ చట్టం పట్ల సుప్రీంకోర్టు ఇటీవల కీలకమైన తీర్పు ప్రకటించింది. దీని వల్ల మీకేంటి అభ్యంతరం అంటూ పేర్కొంది.
ఈ తీర్పు అత్యంత బాధాకరమని పేర్కొన్నాయి విపక్షాలు. కేంద్రం కీలక మార్పులు తీసుకు వచ్చింది చట్టాన్ని. దీనిని పూర్తిగా సమర్థించింది సర్వోన్నత న్యాయ స్థానం(Supreme Court).
ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది విచారణ సందర్భంగా. ఈడీ చేస్తున్న అరెస్టులు, కేసులు, సోదాలు , దర్యాప్తులు అంతా సక్రమమేనని ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేవలం బీజేపీయేతర పక్షాలను, వ్యక్తులను, నాయకులను, వ్యాపారులను, సంస్థలను టార్గెట్ చేస్తోందని ఇందుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందంటూ ఆరోపించారు.
ఇందుకు సంబంధించి 17 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ పేర్కొన్నాయి.
కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సమాజ్ వాది పార్టీ, ఆర్జేడీ , తదితర పార్టీలు సంతకాలు చేశాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జి జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
ఎనిమిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో 3,010 మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 మంది మాత్రమే తప్పు చేసినట్లు తేలారు. 112 సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేవు.
Also Read : భారత్ సాయానికి రుణపడి ఉన్నాం