CM KCR PM Modi : మోదీ ఎకానమీ బక్వాస్ – సీఎం కేసీఆర్
5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ పెద్ద జోక్
CM KCR PM Modi : బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి మోదీని ఏకి పారేశారు. ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని ఎద్దేవా చేశారు. మోదీ చెప్పిన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఒక జోక్ అని పేర్కొన్నారు. మోదీ చెప్పినవన్నీ బక్వాస్ అని , మోసం చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు(CM KCR PM Modi). పెద్దగా కలలు కనాలని వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నం చేయాలని ఆ దిశగా నరేంద్ర మోదీ చేయడం లేదంటూ ఆరోపించారు కేసీఆర్.
తలసరి ఆదాయంలో భారత దేశం వెనుకబడి పోయిందన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ , భూటాన్ , తదితర దేశాల కంటే వెనుకబడి ఉండడం దారుణమన్నారు సీఎం. భారత దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని జోక్ గా ఓ వెర్రిగా అభివర్ణించారు కేసీఆర్. సీఎం ఆదివారం కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చకు సమాధానం ఇస్తూ అదానీ అంశంపై పార్లమెంట్ లో ప్రధాని ఏదో మాట్లాడతారని దేశం మొత్తం ఊహించి నిరాశకు గురి చేసిందన్నారు. నాటి కాంగ్రెస్ హయాంలో లైసెన్స్ రాజ్ ఉందని ప్రస్తుత ప్రభుత్వంలో సైలెన్స్ రాజ్ నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్. 5 ట్రిలియన్ డాలర్ల టార్గెట్ అనేది బక్వాస్ అంటూ పేర్కొన్నారు కేసీఆర్(CM KCR PM Modi).
యుపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలను పోల్చి చూస్తే దేశం ప్రతి రంగంలోనూ ఘోరంగా నష్ట పోయిందన్నారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది అబద్దమని కొట్టి పారేశారు సీఎం కేసీఆర్.
Also Read : కామెంట్స్ తొలగింపుపై కాంగ్రెస్ కన్నెర్ర