Subhas Sarkar : బీజేపీపై దాడులకు పోలీసులదే బాధ్యత
కేంద్ర మంత్రి సుభాస్ సర్కార్ కామెంట్స్
Subhas Sarkar : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందంటూ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వావాదం చోటు చేసుకుంది.
బలవంతంగా నేతలందరినీ వ్యానులో ఎక్కించి స్టేసన్ కు తరలించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు కేంద్ర మంత్రి సుభాస్ సర్కార్(Subhas Sarkar). దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, పోలీసులదేనని నిందించారు.
రైల్వే స్టేషన్లలో నిరసనకారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరపించారు. ఆపై నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో రాళ్లు రువ్వారంటూ మండిపడ్డారు సుభాస్ సర్కార్.
కోల్ కతాలో ఇవాళ చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, వైఫల్యాన్ని తెలియ చేస్తుందన్నారు. రాష్ట్ర పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన లేదా ఆందోళన తెలిపే హక్కు ఉంటుందన్నారు కేంద్ర మంత్రి. రాష్ట్ర సచివాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో బారికేడ్లు కూడా ఉంచారని ఆరోపించారు.
బీజేపీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. జనాన్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలు, వాటర్ ఫిరంగులు ప్రయోగించారు.
ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఎంపీ లాకెట్ ఛటర్జీ సహా మరికొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సామాన్య ప్రజలపై చర్యలు తీసుకున్నారు. గుంపుపై రాళ్లు రువ్వారు. పురుషులను రెచ్చగొట్టారని మంత్రి(Subhas Sarkar) ఆరోపించారు.
Also Read : హింసాత్మకంపై నివేదిక కోరిన కోర్టు