Maganti Babu : మాజీ ఎంపీ వీరంగం పోలీస్ ఆగ్రహం
అంతు చూస్తానన్న బాబుపై కేసు
Maganti Babu : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రం తమదైనట్టు ఫీలవుతున్నారు కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. ఇప్పటికే ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో ఆందోళనలు చేపట్టారు.
Maganti Babu Fires on Police
ఔటర్ రింగ్ రోడ్డు మీద టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మాగంటి బాబు(Maganti Babu) నానా హంగామా చేశారు. తన అనుచరులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. మాజీ ఎంపీని, ఆ పార్టీ నేతలకు పర్మిషన్ ఇవ్వలేదు.
దీంతో ఆగ్రహంతో ఊగి పోయాడు మాజీ ఎంపీ మాగంటి బాబు. నోటికి వచ్చినట్లు తిట్లు తిట్టాడు. ఆపై ఎస్ఐ, సీఐలపై నోరు పారేసుకున్నాడు. మీ అంతు చూస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
మాజీ ఎంపీ అయినంత మాత్రాన ఖాకీలపై నోరు పారేసుకుంటావా అంటూ మండిపడ్డారు. వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. మాజీ ఎంపీ మాగుంట బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read : Revanth Reddy Posters : రేవంత్ రెడ్డిపై పోస్టర్స్ కలకలం