Rachamallu Siva Prasad Reddy: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు ?

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు ?

Rachamallu Siva Prasad Reddy: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై(Rachamallu Siva Prasad Reddy) వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఉన్న సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే రాచమల్లుపై ఈ కేసు నమోదు చేశారు.

Rachamallu Siva Prasad Reddy Case..

పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఎన్నికల కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని… ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావివ్వకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ రౌడీ షీటర్లు, వివాదాస్పద రాజకీయ కార్యకర్తలను పోలీసు స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దీనితో భాగంగా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు శనివారం కొందరు వైసీపీ కార్యకర్తలను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆ వైసీపీ కార్యకర్తలను స్టేషన్ నుంచి ఎమ్మెల్యే, అనుచరులు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీఐ సీరియస్‌ గా తీసుకున్నారు. దీనితో ఎమ్మెల్యే అనుచరులు తన విధులకు ఆటంకం కలిగించారని ,బెదిరించారని , సీఐ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యా దు చేసారు. సీఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 353 , 506 మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read : Election Commission: వివాదాస్పద ఎస్పీలపై ఈసీ కీలక చర్యలు !

Leave A Reply

Your Email Id will not be published!