Chandrababu Naidu : చంద్రబాబు రోడ్ షోకు నిరాకరణ
అనుమతి లేదన్న పోలీసులు
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి బిగ్ షాక్ తగిలింది. ఆయన ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. విశాఖలో రోడ్ షో నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకు సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పెందుర్తిలో చంద్రబాబు నాయుడు రోడ్ షోకు, సమావేశానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు పోలీసులు.
తాము పర్మిషన్ ఇవ్వక పోయినా రోడ్ షో, సమావేశం నిర్వహించి తీరుతామని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 250 మందికి పైగా పోలీసులను మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో కాకుండా ఆనందపురం రూట్ లో బస్ మీద నుంచే నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించేలా ఏర్పాటు చేసుకోవాలని నేతలకు పోలీసులు సూచించారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ వర్గాలు. ఇదిలా ఉండగా పెందుర్తి పూర్తిగా పోలీసుల వలయంలో చిక్కుకు పోయింది. కాగా వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ హాల్ లో చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రి బస చేయనున్నారు. ఇందుకు సంబంధించి ముందస్తుగా తనిఖీలు చేపట్టారు.
Also Read : Vande Bharat Train